ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తి రక్షణతో పాపికొండల పర్యటన

ABN, First Publish Date - 2021-04-16T06:28:05+05:30

పాపికొండల పర్యటనలో లోటు పాట్లు లేకుండా చూసుకుంటామని ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖ జనరల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌ అన్నారు.

బోటులో ప్రయాణిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ పర్యాటక అభివృద్ధి జీఎం పవన్‌కుమార్‌



పోలవరం, ఏప్రిల్‌ 15: పాపికొండల పర్యటనలో లోటు పాట్లు లేకుండా చూసుకుంటామని ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖ జనరల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌ అన్నారు. పాపికొండల టూరిజం బోటు హరిత ట్రయల్‌ రన్‌లో భాగంగా రీజనల్‌ డైరెక్టర్‌ ఎంబీఎస్‌ రాజు, జలవనరుల శాఖ అధికారుల బృందం సింగన్నపల్లిలో జలవిహారయాత్ర తనిఖీ కేంద్రం నుంచి పాపికొం డలు, పేరంటాలపల్లి వరకు గురువారం బోటులో ప్రయాణించి పరిశీలిం చారు. పాపికొండలు ప్రయాణించే యాత్రికులకు నూరు శాతం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సింగన్నపల్లి, పేరంటాల పల్లిలోని జల విహారయాత్ర కేంద్రాలను పరిశీలించినట్టు చెప్పారు. బోట్ల కు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేలా పోర్టు అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు పరిశీలన చేసినట్లు చెప్పారు. పరిశీలనలోని అంశాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఆ తర్వాతే బోట్లకు అనుమతి ఇస్తామని తెలిపారు. పోలవరం మండలంలో 40 టూరిజం బోట్లు ఉన్నా యని, వాటిలో ఏపీ టూరిజానికి చెందిన రెండు బోట్లకు మరో ప్రైవేటు బోటుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయని తెలిపారు.

Updated Date - 2021-04-16T06:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising