ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2021-11-26T05:57:03+05:30

భారీ వర్షాలకు దెబ్బతిని రంగు మారిన ధాన్యా న్ని ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు.

మొలకలు వచ్చిన వరి పనలు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు 

దెబ్బతిన్న పొలాల పరిశీలన

ఎకరాకు రూ. 25 వేలు పరిహారమివ్వాలన్న  రైతు నాయకులు

గణపవరం, నవంబరు 25: భారీ వర్షాలకు దెబ్బతిని రంగు మారిన ధాన్యా న్ని  ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు,  మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలో దెబ్బతిన్న  పొలాలను  పరిశీలించారు.  పాడైన పంటకు పూర్తి పరిహారం ఇవ్వాలని, ఆర్బీకేలు అలంకార ప్రాయంగా మిగిలా యన్నారు.  ధాన్యం ఎందుకు కొనుగోలు  చేయడం లేదని  ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, ఏలూరు పార్లమెంట్‌  ఆర్గనైజింగ్‌  కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, రైతు ప్రధాన కార్యదర్శి కవల కోదండ రాంబాబు, మొయ్యేరు  ఽఅధ్యక్షుడు కానుమిల్లి చంటి, ముగ్గళ్ల సర్పంచ్‌ విమల పాల్గొన్నారు.

 

పొలాలను పరిశీలించిన రైతు సంఘ నాయకులు

పెంటపాడు: వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 25 వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం  అలంపురంలో  దెబ్బతిన్న పొలాలను రైతు సంఘం నాయకుల బృందం పరిశీలించి మాట్లాడారు.  ఎకరానికి   కనీసం 10 బస్తాల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. రైతులు ఆశీర్వాదం, వెంకటేశ్వర రావు, శేఖర్‌, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising