ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ ఆపేశారు..

ABN, First Publish Date - 2021-09-17T05:12:55+05:30

ప్రభుత్వం పింఛన్‌ లబ్ధిదారులకు కోత వేయనుంది.

వైకల్యంతో మంచానపడిన బాధితురాలికి పింఛన్‌ నిలిచిపోయింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిబంధనల ముసుగులో రాజకీయ కక్ష

లబ్ధిదారుల గగ్గోలు


పోలవరం, సెప్టెంబరు 16: ప్రభుత్వం పింఛన్‌ లబ్ధిదారులకు కోత వేయనుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పింఛన్లు అధిక శాతం నిలిపి వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలవరం మండలంలో 6,281 మం దికి పింఛన్లు ఇస్తుండగా ప్రతీ గ్రామంలో 15 నుంచి 20శాతం పింఛన్లను నిలిపివేసే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరో 20శాతం రీవెరిఫికేషన్‌ పేరుతో నిలిపివే అవకాశాలున్నాయి. రైస్‌ కార్డు లేదని, విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఉద్యోగులని కొంతమందికి ఈ నెల పింఛన్లు నిలిపివేయగా 234 పింఛన్లను పునఃపరిశీలన కోసం నిలిపివేశారు. మండల కేంద్రంలో టీడీపీ నేత పైలా సత్యనారాయణకు ఎలాంటి ఆదాయ వనరు లు లేకున్నా వృద్ధాప్య పింఛన్‌ నిలిపివేశారు. ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమా దంలో వైకల్యంతో మంచానికే పరిమితమైన బంటు సంధ్యారాణి పింఛను నిలిచిపోయింది. టీడీపీ మహిళా కార్యకర్త బెజవాడ వరలక్ష్మి వితంతు పింఛను కూడా నిలిపివేయడంతో కక్షపూరితంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల పింఛన్‌ నిలిపివేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.


పింఛన్‌ సొమ్మే ఆధారం

65 సంవత్సరాలు పైబడి ఉన్న నాకు ఏ ఆధారం లేదు. నా కుమార్తె వైద్యానికి, మందులకు, నా వైద్యానికి మందులకు పింఛన్‌ ఆధారం. పింఛన్‌ నిలిపివేయడంతో పరిస్థితి అగమ్యగోచరం.

కైలా సత్యనారాయణ


వితంతు పింఛన్‌ నిలిపివేశారు

నా భర్త చనిపోయిన ఏడు సంవత్సరాలైంది. ఏడు సంవత్సరాలుగా వితంతు పింఛన్‌ తీసుకుం టున్నాను. ఏ ఆధారం లేని నాకు పింఛన్‌ నిలిపి వేశారు. నా పింఛన్‌ పునద్ధరించాలి.

బెజవాడ వరలక్ష్మి


అర్హుల పింఛన్లు ఆపుతున్నారు

అధిక శాతం అర్హులైన వారి పింఛన్లు అధికా రులు నిలిపివేస్తున్నారు. కారణం తెలియడం లేదు. విచారించి పింఛన్లు కొనసాగించాలి. పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

మంగిన వెంకట రమణ, 6వ వార్డు మెంబర్‌

Updated Date - 2021-09-17T05:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising