ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోడ్‌’ అమల్లోకి వచ్చినా...

ABN, First Publish Date - 2021-01-24T05:47:34+05:30

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికి మండలం లో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు.

దేవరపల్లి బస్టాండ్‌పై ముసుగువేయకుండా ఉన్న ఫ్లెక్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపురం, జనవరి 23: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికి మండలం లో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎన్నికల నిబంధనల మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలు, ఫ్లెక్సీలు మొదలైన వాటికి ముసుగులు వేయాల్సి ఉన్నా గ్రామాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం కానీ, ఆయా పార్టీలకు చెందిన  ఫ్లెక్సీలు తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  వచ్చే నెల నుంచి ఇంటి వద్దకే బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను  మండల కేంద్రానికి తరలించారు. అయితే కోడ్‌ అమలులోకి వచ్చినప్పటికి వాహనాలపై ముసుగులు వెయ్యకపోయినా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు  వినిపిస్తున్నాయి. 

దేవరపల్లి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా దేవరపల్లి మండలంలో ఫ్లెక్సీలు తొలగించలేదు. విగ్రహాలకు ముసుగులు వెయ్యలేదు.  ఎక్కడా కోడ్‌ అమలు కావడం లేదు. అధికారుల్లో స్పందన లేదని పలువురు విమర్శిస్తున్నారు. 

ద్వారకాతిరుమల: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా ఎక్కడా ఫ్లెక్సీలు తొలగించలేదు.  ఇంకా ఫ్లెక్సీలు తొలగించకపోవడంపై పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కాగా   ఎన్నికల వ్యవహారం పై సమావేశాలు, అధికారులు, ఉద్యోగులు సమావేశాలు జరిగినట్లు సమాచారం. 

Updated Date - 2021-01-24T05:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising