ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టుల కదలికలు లేవు : ఎస్పీ

ABN, First Publish Date - 2021-10-28T05:20:14+05:30

పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు లేవని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ స్పష్టం చేశారు.

మాట్లాడుతున్న ఎస్పీ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, అక్టోబరు 27: పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు లేవని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ స్పష్టం చేశారు. బుధవారం నూతిరామన్నపాలెం గిరిజన సంక్షే మ ఆశ్రమ బాలుర పాఠశాలలో సర్పంచ్‌ లక్ష్మి అధ్యక్షతన జరిగిన పోలీసు అమర వీరుల దినోత్సవం, మెగా వైద్య శిబిరంలో ఎస్పీ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేక రులతో మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు లేకున్నా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహి స్తున్నట్టు తెలిపారు. బుధవారం మావోయిస్టుల బంద్‌ ప్రభావం జిల్లా ఏజెన్సీలో లేదన్నారు. కరోనాతో 11 మంది, ఇతర కారణాలతో ముగ్గురు మొత్తం 14 మంది పోలీసులు చనిపోయారని, వారికి నివాళులర్పించారు. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఓపెన్‌ హౌస్‌ నిర్వహించి పోలీసుల విధులు, దిశ యాప్‌, మహిళా చట్టాలపై విద్యార్థులకు వివరించారు. కేఆర్‌ పురం ఐటీడీఏ పీవో ఆనంద్‌, డీఎస్పీ లతాకుమారి, సీఐ మూర్తి, డిప్యూటీ డీఎం హెచ్‌వో డాక్టరు మురళీకృష్ణ, డాక్టరు సతీష్‌, డాక్టరు సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising