ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్కారు వైద్యం ఎక్కడ..?

ABN, First Publish Date - 2021-06-18T04:47:02+05:30

గిరిజన గ్రామాలకు సర్కారు వైద్యం కనూచూపు మేరలో లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి పీహెచ్‌సీలో వైద్య సేవలు అంతంత మాత్రం

గిరిజనం గగ్గోలు


జీలుగుమిల్లి, జూన్‌ 17: గిరిజన గ్రామాలకు సర్కారు వైద్యం కనూచూపు మేరలో లేదు. ఐటీడీఏ పరిధిలో ఆస్పత్రులకు మహర్ధశ అంటూ  అధికారు లు ప్రజా ప్రతినిధులు ఊదరగొడుతున్నా ఆచరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవుట్‌ పేషెంట్‌ (వోపీ) సేవలు కూడా అందడం లేదు. గిరిజన గ్రామాల్లో వైద్య సదుపాయంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో గిరిజనం అనారోగ్యంతో బాధపడుతున్నారు.


జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా వ్యాప్తితో వైద్య సిబ్బంది రోగులను మరింత దూరం ఉంచుతున్నారు. వైద్యులు ఆందుబాటులో లేకపోవడం, ఉన్న వైద్యు ల ఆసహనం, దూరం పాటించాలని చెప్పడంతో కొందరు సర్కారు వైద్యం దక్కదని పీహెచ్‌సీకి రావడం మానుకుంటున్నారు. గతంలో నిత్యం వంద మంది అవుట్‌ పేషెంట్‌లు ఉంటే ప్రస్తుతం పదిలోపు ఉండడం పరిస్థితికి అద్దం పడుతుంది. వైద్య సిబ్బంది ఉదయం పది గంటల తర్వాత విధులకు హాజరవుతున్నారని పలువురు చెబుతున్నారు.


ప్రసూతి వైద్య సేవలు లేవు


జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల ప్రసూతి వైద్యశాలగా పేరుంది. చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి రాత్రి వేళ పురిటి నొప్పులతో వచ్చిన వారికి ప్రసూతి సేవలు లభించేవి. కొంతకాలంగా కరోనా వ్యాప్తి ఆస్పత్రిలో పురుటి కేసులు దాదాపు కనుమరుగయ్యాయి. రాత్రి వేళ వైద్యా ధికారి అందుబాటులో లేక కొందరు గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలున్నాయి.


కరోనా బాధిత గిరిజనులకు అందని మందులు


కొద్దిరోజులుగా జీలుగుమిల్లి శివారు గిరిజన గ్రామాలైనచంద్రమ్మకాలనీ, చిర్రివారిగూడెం, తాటియాకులగూడెం ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. సరైన వైద్య సేవలు, మందులు అందక ఆందోళన చెందు తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆరకొరగా కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీఆర్‌డీఎల్‌, ట్రూనాట్‌ పరీక్షలకు నమూనాలు పంపించినా ఆర్డీకె కిట్‌లతో అనుభవనంలేని సిబ్బంది క్షేత్రస్థాయి పరీక్షలు చేయిస్తున్నా రని పలువురు ఆరోపిస్తున్నారు. టెస్ట్‌ ఫలితం సక్రమంగా రావడంలేదని వాపోతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని ముందస్తుగా గుర్తించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. దీనితో కొందరు ప్రైవేటు వైద్యం పొందాల్సి వస్తుందన్నారు. వలంటీర్లు ఆధార్‌, రేషన్‌ వివరాలు నమోదు చేసుకోవడం తప్ప ప్రయోజనం లేదంటున్నారు.


గిరిజన గ్రామాల్లో పాజిటివ్‌ కేసుల గుర్తింపు, వైద్యం విషయమై సీహెచ్‌వో జె.విల్సన్‌బాబును వివరణ అడగ్గా పాజిటివ్‌ కేసులు గుర్తించడానికి టెస్ట్‌లు చేస్తున్నామన్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారికి వైద్య సదుపాయాలు కల్పించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-06-18T04:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising