ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-04-17T05:14:01+05:30

పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ సిబ్బంది సమస్వయంతో కృషిచేయాలని కమిషనర్‌ కెటి.సుధాకర్‌ సూచించారు.

సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌ సుధాకర్‌



కొవ్వూరు, ఏప్రిల్‌ 16 : పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ సిబ్బంది సమస్వయంతో కృషిచేయాలని కమిషనర్‌ కెటి.సుధాకర్‌ సూచించారు. కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయంలో వివిధ శాఖల సిబ్బంది, సచివాలయ కా ర్యదర్శులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయ శానిటరీ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య మొరుగుదలకు కృషిచేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. శాఖలవారీగా సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించారు. కార్యక్రమంలో మేనేజర్‌ జి.రాధాకృష్ణ, టీపీవో టి.బాలాజి, శానిటరి ఇన్‌చార్జి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising