ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోచుకున్న సొమ్ముతో అభ్యర్థుల కొనుగోలు

ABN, First Publish Date - 2021-03-05T05:26:58+05:30

అధికారంతో దోచుకుంటున్న సొమ్ముతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తుందని, ఎన్నికల్లో పోటీగా ఉన్న అభ్య ర్థులను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ఆరోపించారు.

విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీకి ఓటమి భయం : ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర


నరసాపురం, మార్చి 4: అధికారంతో దోచుకుంటున్న సొమ్ముతో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తుందని, ఎన్నికల్లో పోటీగా ఉన్న అభ్య ర్థులను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ఆరోపించారు. నరసాపురంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార పార్టీ ఓటమి భయంతోనే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ప్రలోభాలు, బెదిరింపులకు గురిచేసి నామినేషన్లను ఉపసంహరింపజేస్తున్నారంటూ ఆరోపించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ ఎన్నికల తరువాత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రూ.2వేల కోట్లు పన్నుల భారం వేసేందుకు సిద్దంగా ఉంద న్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అరాచకాలు సాగుతున్నా యన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నికల తరువాత క్యాంప్‌లు ఉండేవన్నారు. వైసీపీ పాలనలో అభ్యర్థులను కాపాడుకునేందుకు ముందుగా క్యాంపులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి బెదిరింపులు, దౌర్జన్యాలే కారణమన్నారు. సమావేశంలో పొత్తూరి రామరాజు, కొప్పాడ రవి, కడిమి సంతోష్‌ హేమ లత, కత్తుల శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising