ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న మినీ లారీ

ABN, First Publish Date - 2021-05-17T06:24:38+05:30

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయప డిన సంఘ టన ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య మృతి.. భర్తకు గాయాలు

 ఉంగుటూరు, మే 16: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్రంగా గాయప డిన సంఘ టన ఇది. ఉంగుటూరు మం డలం కైకరం గ్రామా నికి చెందిన సిరికి చంద్రరావు, సోవమ్మ భార్యాభర్తలు. కొద్ది రోజుల క్రితం సోవమ్మ కాలికి దెబ్బ తగలడంతో తాడేపల్లి గూడెం లోని కుమార్తె ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది.  ఆరోగ్యం కుదుట పడడంతో ఆదివారం ఉదయం ఆటో మాట్లాడుకుని తాడేపల్లి గూడెం నుంచి కైకరం వస్తుండగా నాచుగుంట వద్ద ఆటోను ఆపి డ్రైవర్‌ కిందికి దిగాడు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న మినీ లారీ ఆటోను ఢీకొనడంతో సోవమ్మ(65), చంద్రరావు తీవ్రంగా గాయపడగా హైవే అంబులెన్స్‌లో వీరిని చికిత్స నిమిత్తం తణుకు తీసుకు వెళుతుండగా సోవమ్మ మృతి చెందింది. దీనిపై చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సోవమ్మ మృత దేహానికి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు వివరించారు. చంద్రరావుకు ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. కుమారుడు రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-05-17T06:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising