విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించాలి : గజల్
ABN, First Publish Date - 2021-10-30T05:01:02+05:30
విద్యార్థుల సృజనాత్మకతను పెం పొందించడంతో గురువుల పాత్ర కీల కమని గజల్ శ్రీనివాస్ అన్నారు.
గజల్ శ్రీనివాస్ దంపతులను సత్కరిస్తున్న సీఎస్‌ఎన్ డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యం
భీమవరం ఎడ్యుకేషన్, అక్టోబరు 29 :విద్యార్థుల సృజనాత్మకతను పెం పొందించడంతో గురువుల పాత్ర కీల కమని గజల్ శ్రీనివాస్ అన్నారు. సీఎస్‌ఎన్ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన టీచర్స్ ఓరియంటేషన్ కార్యక్రమంలో మాట్లాడారు. సృష్టిలో అమ్మ ప్రేమ చాలా గొప్పదని, ప్రతి విద్యార్థి తన తల్లి పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలన్నారు. గజల్ శ్రీనివాస్, సురేఖ దంపతులను కళాశాల సెక్రటరీ డా.చీడే సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఎస్ సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పడుపు గోపి, వెన్స్ బర్రో మహేష్, రామిప్రోలు భగవాన్, ఎండీ.సలీంఖాన్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:01:02+05:30 IST