ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ముగిసిన మావుళ్లమ్మ దీక్షలు

ABN, First Publish Date - 2021-11-30T05:41:50+05:30

మావుళ్ళమ్మ దీక్షలు సోమవారంతో వైభవంగా ముగిశాయి. అమ్మవారి నామస్మరణతో పూర్ణాహుతితో మాలధారులు పాల్గొని తమ దీక్షను విరమించుకుని కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద మాలధారుల పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం రూరల్‌, నవంబరు 29:మావుళ్ళమ్మ దీక్షలు సోమవారంతో వైభవంగా ముగిశాయి. అమ్మవారి నామస్మరణతో పూర్ణాహుతితో మాలధారులు పాల్గొని తమ దీక్షను విరమించుకుని కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు. అక్టోబరు 20న అమ్మవారి మండల దీక్షలను 212 మంది స్వీకరించారు. ఆదివారంతో దీక్ష పూర్తికావడంతో సోమవారం ఉదయం ఆలయం వద్ద అర్చకుల పర్యవేక్షణలో ఇరుముడులను కట్టించుకున్నారు. అనంతరం మేళతాళాలతో గ్రామ ప్రదక్షిణ ఆంధ్రాబ్యాంకు మీదుగా సాగి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులను అందజేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి నెయ్యితో అభిషేకం, ప్రత్యేకంగా నిర్వహించిన హోమగుండంలో ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, కొడమంచిలి కొప్పేశ్వరరావు ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు దేవస్థానంలో ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందించారు. కార్యక్రమాన్ని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్‌ పర్యవేక్షించారు. 

Updated Date - 2021-11-30T05:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising