ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి మార్కెట్‌ సిద్ధం

ABN, First Publish Date - 2021-04-17T05:24:07+05:30

స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మామిడి కమీషన్‌ దుకాణాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలపూడి, ఏప్రిల్‌ 16: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మామిడి కమీషన్‌ దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఎగుమతి కూడా చేస్తు న్నారు. ప్రస్తుతం బంగినపల్లి ధర నాణ్యతను బట్టి టన్ను రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. వారం రోజుల క్రితం ప్రారంభమైన మార్కెట్‌ తొలి రోజుల్లో నాణ్యమైన కాయలు రావడంతో అధిక రేట్లు వచ్చాయి. ప్రస్తుతం కాయ నాణ్యత తగ్గుతోందని, గత నెల తేనెమంచు వల్ల నాణ్యత తగ్గిందని చెబుతున్నారు. మార్కెట్‌ యార్డులో ఏటా పది దుకా ణాలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది దుకాణాల సంఖ్య కూడా తగ్గింది. ఇక్కడి నుంచి వ్యాపారులు గుజరాత్‌, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండడంతో ఎగుమ తులు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు మాత్రం కొంత ఎగుమతి అవుతున్నాయి.


ఈ ప్రాంతంలో మామిడి విస్తీర్ణం 90 శాతం వరకు తగ్గిపోయింది. స్థానికంగా ఉన్న తోటలు, గ్రామాలతో పాటు రాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ ప్రాంత గ్రామాలైన దమ్మపేట, అశ్వారావుపేట నుంచి కూడా మార్కెట్‌కు తరలిస్తుంటారు. కొందరు రైతులు నేరుగా విజయవాడ, హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తారు. కరోనా సమయంలో మామిడి పండు కూడా మంచి ఆరోగ్యమేనని చెబుతున్నారు. రసాయనాల వినియోగం వల్ల కొంత ఆందో ళన చెందుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత మార్కెట్‌ ఎగుమతుల్లో లాక్‌డౌన్‌ వల్లే మందకొడిగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.


కరోనా నిబంధనలతో ఇబ్బందులు

ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ఎగుమతులు మందకొడిగా ఉన్నాయి. గత ఏడాది కూడా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఎగుమతులు, ధర ఎక్కువ ఉంది. ఈ ఏడాది అంత వేగంగా కొనసాగడం లేదు. కాయలలో కూడా నాణ్యత పెరగాల్సి ఉంది. అప్పుడే మంచి ధర వస్తుంది.

చిక్కాల నాగేశ్వరరావు, కమీషన్‌ వ్యాపారి

Updated Date - 2021-04-17T05:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising