ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే ప్రక్రియ వేగవంతం : జేసీ

ABN, First Publish Date - 2021-06-23T05:54:22+05:30

సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేస్తామని, డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధికారాలను కల్పించిందని జేసీ వెంకట రమణా రెడ్డి తెలిపారు.

మ్యాప్‌ ద్వారా జేసీ భూ పరిశీలన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు/పెదపుల్లేరు (ఉండి), జూన్‌ 22: సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేస్తామని, డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధికారాలను కల్పించిందని జేసీ వెంకట రమణా రెడ్డి తెలిపారు. మండలాల వారీగా డిప్యూటీ తహసీల్దార్ల నేతృత్వంలో మొబైల్‌ బృందాలను నియమించా మని,  భూముల రీ సర్వేలో వివాదాలను అప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ మొబైల్‌ బృందాలతో కార్యాచరణ రూపొందించామన్నారు. తోగుమ్మిలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం అమలుతీరును రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. భూ రక్ష పథకం ద్వారా సర్వే చేసి ఉచితంగా జగనన్న హద్దురాళ్ళు వేస్తున్నామన్నారు. కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి, తహసీల్దార్‌ బి.నాగరాజ నాయక్‌, డిప్యూటీ ఐఓఎస్‌ రామకృష్ణ, మండల సర్వేయర్‌ పి.సత్యనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు. అలాగే మరో పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన పెదపుల్లేరులో జేసీ  డ్రోన్‌ కెమెరాతో తీసిన భూముల మ్యాప్‌ను పరిశీలించారు. ఏసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి, నరసాపురం ఆర్డీవో పద్మావతి,  తహసీల్దారు కృష్ణజ్యోతి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T05:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising