ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక సం‘క్షామం’

ABN, First Publish Date - 2021-08-02T05:51:52+05:30

నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ కార్యక్రమం పూర్తిగా నీరుగారి పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దారి మళ్లిన సంక్షేమ నిధులు

పథకాల ప్రయోజనాలకు దూరమవుతున్న నిర్మాణ కార్మికులు

ఏడాదిగా అమలుకాని పథకం

వైఎస్సార్‌ బీమా పేరుతో రిక్తహస్తం

జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో 850 క్లెయిమ్‌లు


ఏలూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ కార్యక్రమం పూర్తిగా నీరుగారి పోయింది. కష్ట జీవులపై సవతి తల్లి ప్రేమను చూపుతున్న రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమం కోసం వారు చెల్లించిన నిధులు కూడా వారికి దక్కకుండా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 850 కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌ బీమా పథకాన్ని చూపి సంక్షేమ ఫలాలను పూర్తిగా ఆపేసింది. జిల్లాలో కూడా సుమారు 80 నుంచి రూ.90 కోట్ల మేర కార్మిక సంక్షేమ నిధు లు దారి మళ్లాయని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా ఒక్క సంక్షేమ ప్రయోజనాన్ని కూడా ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులకు అందకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఒక్కరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి నుంచి ప్రయోజనం దక్కలేదు. దీంతో కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో తమ పేర్ల ను నమోదు చేసుకునేందుకు వెనకాడుతున్నారు. సుమారు 50 వేల మంది కష్టజీవులు తమ పేర్లు నమోదు చేసుకోలేదు.


పథకం ప్రయోజనాలివీ..


భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996లో జరిగింది. రాష్ట్రంలో 2007 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒక్కొక్క కార్మికుడి నుంచి కార్మిక శాఖ సభ్యత్వ రుసుం కింద ఏటా 110 రూపాయలు వసూలు చేస్తుంది. దీనికితోడు వివిధ భవనాలు, నిర్మా ణాల కాంట్రాక్టర్లు, ఓనర్ల నుంచి 1 శాతం సెస్‌ వసూలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కార్మికులకు పలు సంక్షేమ ప్రయోజనాలు కార్మిక శాఖ అఽందిస్తుంది. కార్మికుల ఆడ పిల్లలకు పెళ్లయితే ఒక్కొక్కరికి 20 వేలు చొప్పున పెళ్లికానుకగా అందించాలి. కార్మికుడి భార్య లేక కూతుర్లకు ప్రసవిస్తే రెండు కాన్పులకు రూ. 20 వేల చొప్పున అందించాలి.. ప్రమాదంలో కార్మికుడు మరణించినా, తీవ్రంగా గాయపడి దివ్యాంగుడిగా మారినా 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. ఆసుపత్రి ఖర్చులకు 3 నెలలపాటు 3 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలి. సహజ మరణమైతే అంత్యక్రియలకు 20 వేల రూపాయలు చెల్లించాలి. నమోదు కాని కార్మికుడు ప్రమాదంలో మరణించినా, తీవ్రంగా గాయపడినా రూ.50 వేలు పరిహారం అందిం చాలి. 9 నుంచి ఇంటర్‌ చదివే కార్మికుల పిల్లలకు ఏటా 1200, ఆపై చదువులకు రూ. 5 వేలు స్కాలర్‌షిప్‌ ఇవ్వాలి. కార్మికుల ట్రైనింగ్‌ నిమిత్తం 15 రోజులకు 7 వేలు చొప్పున ఉచిత సాయం అందించాలి. 


  ఏడాది కాలంగా ఆగిపోయాయి


భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కిందటేడాది 7,499 మంది కార్మికులకు 16.04 కోట్ల రూపా యలు వివిధ ప్రయో జనాలు అందాయి. కానీ ఏడాది కాలం గా ఇవన్నీ ఆగిపోయాయి. వైఎస్సార్‌ బీమా, వివిధ కార్పొ రేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామనే పేరుతో ఈ పథకాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ప్రమాద, మరణ సాయం, అంత్యక్రియలు ఖర్చులు మినహా పెళ్లి కానుకలు, డెలివరీ సహాయం, స్కాలర్‌షిప్‌లు అన్నీ నిలిచి పోయాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 850 మంది కార్మికులు వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వీటిలో ఏ ఒక్కరికీ ప్రయోజనం దక్కక పోవడం విశేషం. ఈ కారణం గా 50 వేల మంది కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు దూరమయ్యారు. కిందటేడాది బోర్డు పరిధిలో 1.92 లక్షల మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకోగా ఈ ఏడాది 1.38 లక్షల మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. 


రెగ్యులర్‌ చేయడానికే 

ఎన్‌. సుబ్రహ్మణ్యం, డీసీఎల్‌ 

పథకాలు ఏమీ నిలిచిపోలేదు. అన్నీ సక్రమంగా అమలు జరుగుతాయి. కార్మికుల పేర్లు ఇటు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోనూ, కార్పొరేషన్లు, వైఎస్సార్‌ బీమాలోనూ ఉన్నాయి. అందువల్ల రెండు చోట్లా కార్మికులు క్లెయిముల కోసం దర ఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో క్లెయిముల పరిష్కారం సమస్యగా మారుతోంది. వీటిని రెగ్యులర్‌ చేయడానికి పథకా లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కొవిడ్‌ కారణంగా పరిస్థితులు గాడిన పడలేదు. 


Updated Date - 2021-08-02T05:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising