ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2021-08-04T05:04:47+05:30

అర్హులకు పోలవరం పునరావాస పరిహారం అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఐటీడీఏ పీవో ఒ. ఆనంద్‌ అన్నారు.

అధికారులను వివరాలు అడుగుతున్న జేసీ, పీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్కునూరు/పోలవరం, ఆగస్టు 3: అర్హులకు పోలవరం పునరావాస పరిహారం అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఐటీడీఏ పీవో ఒ. ఆనంద్‌ అన్నారు. కుక్కునూరు మండ లంలోని కుక్కునూరు ఏ బ్లాక్‌, గొమ్ముగూడెం, రామచంద్రాపురం, దాచారం పునరావాస కాలనీ ల్లో వీరు పర్యటించారు.  41.1 కాంటూరు లెవ ల్లో ముంపునకు గురవుతున్న గ్రామస్థులు రాబోయే వరదలకు ముందుగానే పునరావాస పరిహారం చెల్లించి తాడ్వాయిలో నిర్మించే కాలనీకి తరలించాలని వారికి విజ్ఞప్తి చేశారు. పీవో ఆనంద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 35 కాంటూరు లెవల్లో ఉన్న గ్రామాలకు  పరిహారం చెల్లిస్తామన్నారు.  41.1 కాంటూర్‌ లెవల్లో ఉన్న గ్రామాలకు కూడా బిల్లుల చెల్లింపు వివరాలు నమోదు చేసుకున్నామన్నారు. అనంతరం పోలవరం మండలంలో ముంపు గ్రామాలైన కొరుటూరు, చీడూరు, సిరివాకల్లో జేసీ అంబేడ్కర్‌ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యం లో పాలప్యాకెట్లు అందించారు. పరిహారం అందిన నిర్వాసితులు అటవీ మార్గంలో ఏర్పాటు చేసిన రోడ్డు మార్గంలో పునరావాస గ్రామాలకు  వెళ్లాలని సూచించారు.

Updated Date - 2021-08-04T05:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising