ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవికొలను గ్రామస్థులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-08-31T05:25:00+05:30

పోలీసులు ప్రజా సేవకులా ? లేక అధికార పార్టీ సేవకులా? అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మండిపడ్డారు.

అడవికొలనులో విలేకరులతో మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అఽధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధితులను పరామర్శించిన జనసేన జిల్లా అధ్యక్షుడు, నాయకులు

నిడమర్రు ఆగస్టు 30 : పోలీసులు ప్రజా సేవకులా ? లేక  అధికార పార్టీ సేవకులా? అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మండిపడ్డారు. సోమవారం అడవికొలనులో తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌ బొలిశెట్టి శ్రీనివాస రావు, ఇతర జిల్లా నాయకులు పర్యటించారు. ఆదివారం రహదారి నిర్మాణం కోసం ర్యాలీ నిర్వహిస్తూ పోలీసుల లాఠీ దెబ్బలు తిని, అరెస్టయిన వారిని పరామర్శించారు. అనం తరం విలేకరులతో గోవిందరావు మాట్లాడుతూ పార్టీలకతీతంగా రోడ్డు కోసం పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని, ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రామస్థులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంపై వచ్చే నెల 2వ తేదీ నుంచి నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బొలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతుం దని, అడవికొలను ఘటనే నిదర్శనమన్నారు. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది చందాలు వేసుకొని రోడ్లు వేసుకోవడానికా? అని ప్రశ్నించారు. అమాయకులపై దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అడవికొలను రహదారి నిర్మాణం కోసం తన వంతుగా బొలిశెట్టి రూ.10 వేలు స్థానిక సర్పంచ్‌ పాలా వెంకటేశ్వరరావుకు అందజేశారు. నాయకులు నిమ్మల దొరబాబు, పి.హరనాథ్‌, కొండా చింతయ్య, పాలా సత్యనారాయణ, మైలవరపు సురేంద్ర, వాసు, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-31T05:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising