ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొందరికే జగనన్న తోడు

ABN, First Publish Date - 2021-10-20T05:36:56+05:30

సంక్షేమ పథకాల్లో కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. చేయూత, ఆసరా, వైఎస్సార్‌ పింఛను, అమ్మఒడి పథకాల సరసన తాజాగా జగనన్న తోడు పథకం కూడా చేరిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 90 వేల మందికి బ్యాంకు రుణాలు

 కేవలం 34 వేల మందికే వడ్డీ చెల్లింపు 

 జిల్లాకు రూ. 1.26 కోట్లు విడుదల

ఏలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల్లో కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. చేయూత, ఆసరా, వైఎస్సార్‌ పింఛను, అమ్మఒడి పథకాల సరసన తాజాగా జగనన్న తోడు పథకం కూడా చేరిపోయింది. ఈ పథకం కింద లబ్ధిదారులు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం చెల్లిస్తానన్న వడ్డీ భారాన్ని తగ్గించుకునే చర్యలు చేపట్టింది. అందుకోసం పూర్తిగా రుణాలు చెల్లించినవారికే వడ్డీ చెల్లింపులు అన్న గీటురాయి పెట్టి మిగిలినవారి వడ్డీ చెల్లింపును వాయిదా వేసింది. జిల్లాలో ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లింపునకు రూ.1.26 కోట్లు విడుదల చేసింది.

వడ్డీ చెల్లింపులు ఇలా..

జగనన్న తోడు పథకం కింద ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 10 వేల రూపాయల రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాలను ఏడాదిలోపు లబ్ధిదారులు తిరిగి చెల్లించాలి. దీనికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే లబ్ధిదారులు రుణాలతో పాటు, వడ్డీ కూడా ముందుగానే బ్యాంకులకు చెల్లిస్తే, ఆ తరువాత ప్రభుత్వం లబ్ధిదారులకు వడ్డీ రాయితీని చెల్లిస్తుంది. పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీ చెల్లింపుల కార్యక్రమాన్ని చేపట్టింది. అందుతున్న సమాచారం మేరకు జిల్లాలో మొత్తం 90,155 మంది జగనన్న తోడు రుణాలు తీసుకోగా, వారిలో 34,400 మందికి మాత్రమే వడ్డీ రాయితీకి అర్హత పొందారు. దీంతో మిగిలినవారిలో ఆందోళన నెలకొంది. 

 ఏడాది పూర్తవకుండానే అనర్హత?

2020 నవంబరు 25న జగనన్న తోడు పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రెండు విడతల్లో జిల్లాలోని 90,155 మంది బ్యాంకు రుణాలు పొందారు. తొలి విడత 52,429 మంది, రెండో విడత 37,726 మంది రుణాలు పొందారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి రుణాలు తిరిగి చెల్లించిన వారికి మాత్రమే ఇప్పుడు వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం జిల్లాలోని 34,400 మంది మాత్రమే వడ్డీ రాయితీకి అర్హత సాధించారు. దీంతో మిగిలిన 55,755 మంది తమకు వడ్డీ రాదేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. రుణ చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయించిన ఏడాది కాలం పూర్తి కాకుండానే లబ్ధిదారుల జాబితాను ఎలా రూపొందిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నవంబరు నెలాఖరు వరకు ప్రామాణికంగా తీసుకుని అప్పుడు వడ్డీ రాయితీ ఇవ్వాలని వారంతా డిమాండు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అనేక మంది రాయితీకి దూరమయ్యారు. వీరికి తిరిగి వడ్డీ చెల్లింపు ఎప్పుడుంటుందనే విషయంలో స్పష్టత లేదు. 

సకాలంలో చెల్లించిన వారికే.. 

 జగనన్న తోడు రుణాలను సకాలంలో చెల్లించిన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఉంటుంది. ఇప్పటికే రుణాలు చెల్లించినవారికి తొలి విడత వడ్డీ చెల్లిస్తున్నాం. మిగిలిన వారికి కూడా వారి రుణ చెల్లింపుల ఆధారంగా వడ్డీ చెల్లింపులు ఉంటాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో ఎక్కువ మందికి వడ్డీ రాయితీ వచ్చింది. 

– శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ


Updated Date - 2021-10-20T05:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising