ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవ్వా తాతల కడుపుకొడుతున్న జగన్: చంద్ర శేషు

ABN, First Publish Date - 2021-09-03T20:57:42+05:30

సీఎం జగన్ అవ్వా తాతల కడుపుకొడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: సీఎం జగన్ అవ్వా తాతల కడుపుకొడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజపాల్ ధ్వజమెత్తారు. వృద్థాప్య ఫెన్షన్ రూ. 3000కు పెంచాలని టీడీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్ర శేషు మాట్లాడుతూ వృద్థుల, వింతవుల ఫెన్షన్‌లకు అడ్డగోలు నిబంధనలతో తొలగిస్తున్నారని, తొలగించిన పెన్షన్లలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్తగా 11 లక్షల పెన్షన్‌లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదని తప్పుబట్టారు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షలకుపైగా పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. ఒక నెల అందుబాటులో లేకపోయినా వారికి ఆ నెల పెన్షన్ లేదని చెప్పడం దుర్మార్గమని శేషు మండిపడ్డారు.


సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది తల్లిదండ్రులను కూడా అనర్హులుగా ప్రకటించడం దారుణమన్నారు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే పెన్షన్స్ రద్దు చేస్తున్నారని, తొలగించిన పెన్షన్స్ వెంటనే తిరిగి ఇవ్వాలని కోరారు. అర్హులైన కొత్తవారికి కూడా పెన్షన్లు ఇవ్వాలని చంద్ర శేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకుమర్తి రామారావు, నంగులూరి జగత్, ఎస్‌ఎస్ ఇస్మాయిల్, గొల్లమందల శ్రీను, ముళ్ళపూడి శ్రీను, ఎలికే ప్రసాద్, ఉండవల్లి శ్రీను, ఆలపాటి రాము, మాధవ్, చదలవాడ నాగేశ్వరరావు, శైల సత్యనారాయణ, రాగాని రామకృష్ణ, శ్రీను, రామకృష్ణ, గంటా శ్రీను, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీడీవోకు టీడీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2021-09-03T20:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising