ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హై ఓల్టేజీతో గృహోపకరణాలు దగ్ధం

ABN, First Publish Date - 2021-05-11T06:23:27+05:30

స్థానిక జానకినగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా హై ఓల్టేజీ రావడంతో ఏసీ, ఇన్వర్టర్‌, ఫ్యాన్లు, మోటార్లు, బల్బులు సుమారు పది ఇళ్లలో కాలిపోవడంతో రూ.3 లక్షలు వరకు నష్టం జరిగిందనిబాధితులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, మే 10:  స్థానిక జానకినగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా  హై ఓల్టేజీ  రావడంతో ఏసీ, ఇన్వర్టర్‌, ఫ్యాన్లు, మోటార్లు, బల్బులు సుమారు పది ఇళ్లలో కాలిపోవడంతో రూ.3 లక్షలు  వరకు నష్టం జరిగిందనిబాధితులు తెలిపారు. బాధితులైన గంటా ఈశ్వరరావు, కాకరాల అబ్రహంలింకన్‌, మల్లెలు దావీదు, వెలమల భాస్కరరావు, బొత్సా రాము, తాడెళ్ల నారాయణరావు తదితరులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం బల్బులు వెలగడం, ఆరడం జరుగుతుండడంతో విద్యుత్‌ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి వెళ్లారని, ఎర్త్‌ వదిలేయడంతో ఈ విధంగా జరిగిందని సిబ్బంది చెబుతున్నారన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు జరిగిన నష్టాన్ని  భర్తీ చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా బాధితుల సమాచారం మేరకు సిబ్బంది వచ్చి ట్రాన్స్‌ఫారంనకు మరమ్మతులు చేస్తున్నారు.

Updated Date - 2021-05-11T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising