ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నత్తనడకన శ్మశాన వాటికల నిర్మాణం

ABN, First Publish Date - 2021-03-05T05:28:52+05:30

పట్టణాల్లో మృత దేహాలను దహనం చేయడానికి అవసరమైన యంత్రాలు, నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించిన పనులు నత్తనడకన పట్టాయి.

భీమవరం శ్మశాన వాటికలో నిర్మాణంలో ఉన్న భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాది కిందట ఐదు పట్టణాలకు 

ఆర్థిక సంఘం నిధులు

భీమవరం, మార్చి 4 : పట్టణాల్లో మృత దేహాలను దహనం చేయడానికి అవసరమైన యంత్రాలు, నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించిన పనులు నత్తనడకన పట్టాయి. జిల్లాలో లక్ష జనాభా దాటిన పట్టణాలలో వీటి ఏర్పాటు కోసం హిందూ శ్మశాన వాటికలకు 14వ ఆర్థిక సంఘం నిధులు గతేఏడాది కేటాయించారు. ఏలూరు నగరానికి రూ.1.52 కోట్లు, భీమవరానికి రూ.1.34 కోట్లు, తాడేపల్లిగూడెంకు రూ.1.22 కోట్లు, అలాగే నరసాపురం, తణుకు పట్టణాలకు కూడా కోటి రూపాయలు వంతున కేటాయించారు. భవనాలు నిర్మించడంతో పాటు అందులో ఎలక్ట్రిక్‌ దహన యంత్రానికి రూ.39 లక్షలు వ్యయం చేసేలా ఈ పనులు సాగుతున్నాయి. శ్మశానవాటిక ప్రాంతాల్లో పచ్చని వాతావరణం ఏర్పాటు చేయడం, దహన సమయంలో బంధువులు ఉండేందుకు సౌకర్యాలు, అనంతరం స్నానం ఆచరించడానికి వసతి, కర్మకాండలు ఏర్పాటుకు వంటి వసతులు కల్పించేలా ఈ పనులు సాగుతున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా ఈ పనులు చాలా కాలం నిలిచిపోయాయి. ఇటీవల మళ్ళీ పనులు ప్రారంభమైనా అవి ఊపందుకోలేదు. భీమవరంలో పనులు కొంత వేగంగా సాగుతున్నాయి. కరోనాకి తోడుగా భారీవర్షాలు కారణంగా కూడా ఈ పనులు నిలిచిపోయాయి. పట్టణాలలో శ్మశానాలు వసతుల సమస్య చాలా కాలంగా పరిష్కారం కావడం లేదు. ఈ ప్యాకేజీ వలన హిందూ శ్మశాన వాటికలు ఆహ్లాదకరంగా తయారవడంలో సందేహం లేదు. 

Updated Date - 2021-03-05T05:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising