పెర్కిపాలెంలో డెంగీ జ్వరాల్లేవ్ : వైద్య బృందం
ABN, First Publish Date - 2021-10-30T04:59:09+05:30
పెర్కిపాలెంలో డెంగీ జ్వరాలు లేవని.. వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని జిల్లా ఉప వైద్యాధికారి వి.ప్రసాద్, సబ్ యూనిట్ అధికారి కె భాస్కరరావు, డాక్టర్ బి.నాగనందిని తెలిపారు.
వీరవాసరం, అక్టోబరు 29 : పెర్కిపాలెంలో డెంగీ జ్వరాలు లేవని.. వైరల్ ఫీవర్ మాత్రమే ఉందని జిల్లా ఉప వైద్యాధికారి వి.ప్రసాద్, సబ్ యూనిట్ అధికారి కె భాస్కరరావు, డాక్టర్ బి.నాగనందిని తెలిపారు. వైద్యాధికారుల బృం దం పెర్కిపాలెం గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. గ్రామంలో జ్వర బాధితుల ఇళ్ళ వద్దకు జ్వరపీడితులతో మాట్లాడారు. గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మరో రెండు రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కొనసాగించాలని ఆదేశించారు. కలుషిత నీటిని, డ్రెయి నేజీ నీటిని సేకరించి లార్వా పరీక్షలు చేశారు. గ్రామస్థులు కాచిన నీటిని తాగాలని అన్నారు. సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది జీవీవీ సత్యనారాయణ, ఎస్.చిట్టిబాబు, ఏఎన్‌ఎం, ఆశ వలంటీర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:59:09+05:30 IST