ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వూరులో తాగునీరు కలుషితం కాలేదు

ABN, First Publish Date - 2021-10-30T05:12:40+05:30

కొవ్వూరు పట్టణంలో తాగునీరు కలుషితం కాలేదని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.

శ్రీరామకాలనీ వైద్య శిబిరంలో సేవలందిస్తున్న మంత్రి వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, అక్టోబరు 29: కొవ్వూరు పట్టణంలో తాగునీరు కలుషితం కాలేదని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. విషజ్వరాలతో అల్లాడుతున్న కొవ్వూరు శ్రీరామ కాలనీవాసులకు భరోసా కల్పించడంతో పాటు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మంత్రి వనిత మాట్లాడుతూ కొవ్వూరులో తాగునీటి కాలుష్యం లేదని నివేదికలు వచ్చాయన్నారు. ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించి, వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. కాలనీలోని అన్ని వీధులలో బ్లీచింగ్‌ చల్లడం, డ్రెయినేజిల పూడికలు తీయడం, తాగునీరు క్లోరినేషన్‌ చేయడం జరుగుతుందన్నారు. వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్పగానే స్పందించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసిన వైద్యుడు తానేటి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 300 మం దికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఎక్కువ మందికి జ్వరం, కాళ్ల నొప్పులు, వాపులు, పిల్లలలో ర్యాషెస్‌ సమస్యలు ఉన్నాయన్నారు.


పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అన్నారు. శ్రీరామకాలనీలో చేపట్టిన సూపర్‌ శానిటేషన్‌ పనులను చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, కమిషనర్‌ టి.రవికుమార్‌, కౌన్సిలర్లు శుక్రవారం పర్యవేక్షించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న తాగునీటిని కమిషనర్‌ రవికుమార్‌ సమక్షంలో పరీక్షించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, వైస్‌చైర్మన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, కౌన్సిలర్లు బొండాడ సత్యనారాయణ,కంఠమణి రమేష్‌, అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, తోట లక్ష్మీప్రసన్న, అంకోలు లిల్లీ వెంకట పద్మ, వరిగేటి సుధాకర్‌, నేతల వెంకటేష్‌, కె.శేషగిరి, డాక్టర్‌ తాడి రామ గుర్రెడ్డి, ఎస్‌.ధర్మరాజు, బి.శ్రీనివాస్‌, సీహెచ్‌. అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising