ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాటలే.. చేతలేవి!

ABN, First Publish Date - 2021-10-30T04:57:00+05:30

వరద ముంపు బారిన పడి ఏడాది దాటినా నష్టపరిహారం అందలేదు..

ఆకివీడు వీరమల్లునగర్‌లో నీటమునిగిన ఇల్లు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ హామీలు నీటి మూటలు

ఆకివీడు, కాళ్ళ మండలాల్లో ముంపు

ఏడాదైనా అందని పరిహారం

పట్టించుకోని పాలకులు


మీకెందుకు మేం ఉన్నాం.. మిమ్మల్ని ఆదుకుంటాం.. మళ్లీ సాధారణ జీవ నం గడిపేలా చేస్తాం.. ఇదీ కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఏడాది కిందట అధికారులు ఇచ్చిన హామీ.. నేటికీ ఆ హామీ నెరవేరలేదు.. చాలా చోట్ల పడిపోయిన ఇళ్లు అలాగే ఉన్నాయి.. పాడైపోయిన రోడ్లు నాటి వరదకు సాక్ష్యంగా చూస్తున్నాయి.. అయినా అటు నాయ కుల్లో కానీ.. ఇటు అధికారుల్లో కానీ కదలిక లేదు.. హామీ ఇచ్చేశారు. వదిలేశారు.. బాధితులు మాత్రం నేడో రేపో తమకు ఇచ్చిన హామీ నెరవేరు తుందని ఏడాదైనా నేటికీ  ఎదురు చూస్తున్నారు.  


ఆకివీడురూరల్‌ అక్టోబరు 29 : వరద ముంపు బారిన పడి ఏడాది దాటినా నష్టపరిహారం అందలేదు..అధికారులు పట్టించుకుంటు న్నారా అంటే అదీ లేదు.. గతేడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కొల్లేరు తీరప్రాంత గ్రామాలైన సిద్ధాపురం, దుంపగడప, ఆకివీడు, కళింగపాలెం, చినిమిల్లిపాడు, కోళ్ళపర్రు, తరటావ, గుమ్ములూరు, చినకాపవరం, పెదకాపవరం, కాళ్ళ మండలంలోని ఎస్‌సీ బోస్‌కాలనీ, కలవపూడి శివారు మోడి, మాలవానితిప్ప, ప్రాతాళ్ళమెరక, ఆనందపురం గ్రామాలు 20 రోజుల పాటు వరద ముంపులో దిగ్బంధం అయ్యాయి. రహదారులపై 4 అడుగులు ఎత్తున నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడి, ట్రాక్టర్లు, పడవలపై ప్రజలు ప్రయాణించారు. గ్రామాల్లో గృహాలన్నీ జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. దీంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారాన్ని అందించారు. పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లను అధికారులు లెక్కించారు. నష్టపరి హారం అందజేస్తామని ఆశచూపారు..నేటికీ ఆ ఊసేలేదు. 


నేటికీ అందని పరిహారం


ఆకివీడు మండలంలో మొత్తం 56 ఇళ్లు దెబ్బతిన్నాయని వాటిలో 45 పాక్షికంగా, మరో 15 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని అధి కారులు నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. వరద ముంపు బారిన పడిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఆర్థిక సహాయమందిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కాళ్ళ మండలంలో ఒక ప్రాతాళ్ళమెరకలోనే ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. ఏడాదైనా ఇప్పటి వరకు బాధితులకు నష్టపరి హారం అందలేదు కదా దాని ప్రస్తావనే లేదని బాధితులు వాపోతున్నారు. రహదారులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. ప్రభుత్వం వాటి  అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదు. ధ్వంసమైన రహదారులపైనే ప్రజలు ప్రయాణిస్తున్నారు. కాల్వ గండ్లు రైతులు స్వచ్ఛందంగా పూడ్చుకున్నారు. 


ప్రభుత్వ హామీ నీటి మూటే  

వరద ముంపు బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నీటి మూటైంది. ఇళ్లు, రోడ్లు, కాల్వగట్లు దెబ్బతిన్నాయి. ప్రజలకు నష్టపరిహారం ఇవ్వకపోగా, రహదారులు అభివృద్ధి చేయలేదు. చాలా దారుణం. 

– భూపతిరాజు తిమ్మరాజు, తెలుగు రైతు రాష్ట్ర  ఉపాధ్యక్షుడు  


ఏడాదైనా.. ఏమీ ఇవ్వలేదు.. 

వరద ముంపులో ఇళ్లునష్టపోయి ఏడాదైంది. నీటిలో నాని గోడలు పడిపోయి, ఇళ్లు కూలిపోయాయి. అప్పులు చేసి ఇళ్లు మరమ్మతులు చేసుకున్నాం. ఇళ్లు మంజూరు చేయాలి. అంతే కాకుండా నష్టపరిహారం అందజేయాలి. 

– సనపల లక్ష్మి, వరద బాధితురాలు, వీరమల్లునగర్‌


ఆదుకుంటామన్నారు.. ఇదేనా?

వరద ముంపు వలన తాము పూర్తిగా నష్టపోయాం. ఇల్లు పడిపోయింది. కుటుంబంతో రోడ్డునపడ్డాం. ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి వదిలేసింది.  పరిహారం రూ.2వేలు ఇస్తామన్నారు.. అదీ ఇవ్వలేదు. 

– సనపల అప్పమ్మ, వరద బాధితురాలు, వీరమల్లునగర్‌

Updated Date - 2021-10-30T04:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising