ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల.. బ్లాక్‌ డే!

ABN, First Publish Date - 2021-12-08T05:13:52+05:30

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 11వ పీఆర్సీని ప్రకటించాలని మునిసిపల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఏలూరులో నిరసన తెలుపుతున్న మునిసిపల్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు 

ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన 

డిమాండ్లు తీర్చాలని నినాదాలు


ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 11వ పీఆర్సీని ప్రకటించాలని మునిసిపల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మస్తర్‌ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకుడు బి.సోమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలన్నారు. పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పీఆర్సీని ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జాన్‌బాబు, లావేటి కృష్ణారావు, బంగారు వెంకటేశ్వరరావు, కె.సత్యనారాయణ, దుర్గారావు, ఏసు రత్నం, అర్జునమ్మ, సీతమ్మ, నాగమణి, సాంబశివరావు, వి.రమేష్‌ పాల్గొన్నారు.

దెందులూరులో ఉపాధ్యాయుల నిరసన

దెందులూరు, డిసెంబరు 7:ప్రభుత్వానికి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగు లు, ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. దెందులూరు, కొవ్వలి, పోతూనూ రు, మేదినరావుపాలెం, చల్లచింతలపూడి, గోపన్నపాలెం తదితర ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీల ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదకొం డవ పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. తొలుత ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో కొద్దిసేపు నినాదాలు చేశారు. ఉద్యోగ కార్మిక, ఉపాధ్యాయ పెన్షనర్‌ల, కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకై దశల వారీగా ఆందోళన చేస్తామన్నారు. 

ప్రభుత్వాసుపత్రి ఉద్యోగుల ఆందోళన

ఏలూరు క్రైం, డిసెంబరు 7 : ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయ మైన కోర్కెలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలి పారు. జిల్లా జేఏసీ చైౖర్మన్‌ ఆర్‌.ఎస్‌.హరినాథ్‌, కన్వీనర్‌ శ్రీనివాసరావు ఆసుపత్రి విభాగం నాయకుడు వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వా సుపత్రి ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 



Updated Date - 2021-12-08T05:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising