ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లలకోడేరు ఉప సర్పంచ్‌ను బర్తరఫ్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-06-17T05:12:48+05:30

గొల్లలకోడేరు ఉప సర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మ నియంతలా వ్యవహరి స్తు న్నారంటూ వార్డు సభ్యు లు బుధవారం నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న వార్డు సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు, జూన్‌ 16: గొల్లలకోడేరు ఉప సర్పంచ్‌ కలిదిండి శ్రీనివాసవర్మ నియంతలా వ్యవహరి స్తు న్నారంటూ వార్డు సభ్యు లు బుధవారం నిరసన తెలిపారు. సర్పంచ్‌ కుక్కల లక్ష్మి అధ్యక్షతన మంగళ వారం జరిగిన పంచాయతీ బోర్డు సమావేశంలో బీసీ, ఎస్సీ వార్డు సభ్యులను ఒకవైపు, ఉప సర్పంచ్‌ తన సామాజిక వర్గానికి చెందిన వారిని మరోవైపు కూర్చోబెట్టడంతో వార్డు సభ్యులు తప్పుపట్టారు. ఆగ్రహించిన శ్రీనివాసవర్మ మీకు సమాధానం చెప్పా ల్సిన అవసరం లేదు. మీ ఐదుగురు వార్డు సభ్యుల స్థానంలో వచ్చేనెల నుంచి ఇన్‌చార్జిలను నియమిస్తాననడంతో వార్డు సభ్యులు కుక్కల బాబూరావు, వీరవల్లి వేణుగోపాల శ్రీనివాస్‌, దేవబరికిన రత్నకళ, దాసరి ఆనందకుమారి, కరోతి వెంకట లక్ష్మి వాకౌట్‌ చేశారు. బుధవారం వీరు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఉప సర్పంచ్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ ఆందోళన చేశారు. వీరికి రాష్ట్ర దళిత నాయకుడు కోరం ముసలయ్య సంఘీభావం తెలిపారు. న్యాయం జరిగేవరకు అధికారులకు, నాయకులకు వినతిపత్రాలు ఇస్తూ నిరసన తెలుపుతామని వారు వివరించారు. 

Updated Date - 2021-06-17T05:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising