ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గట్టు’ జారుతోంది

ABN, First Publish Date - 2021-07-26T05:05:07+05:30

వర్షాకాలం ప్రారంభమై గోదావరి వరదలు వస్తున్నప్పటికి ఆయా గ్రామాలకు రక్షణ కవచగంగా ఉండే ఏటిగట్టు పరిస్థితి మాత్రం బలహీ నంగా మారింది.

గట్టుపై నీరు నిల్వ ఉండడంతో ఎక్స్‌కవేట ర్‌తో రైతులు బాగు చేసుకుంటున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరవలి, జూలై 25: వర్షాకాలం ప్రారంభమై గోదావరి వరదలు వస్తున్నప్పటికి ఆయా గ్రామాలకు రక్షణ కవచగంగా ఉండే ఏటిగట్టు పరిస్థితి మాత్రం బలహీ నంగా మారింది. రెండు, మూడు సంవత్సరాలుగా ఏటి గట్టును పట్టించుకున్న నాధుడు లేకపోవడంతో ఎక్కడికక్కడ గోతులు పడి వర్షానికి అండలు జారి గట్లు బలహీనపడుతున్నాయి. గతంలో  వరదలు సమయంలో ఏటిగట్టుపై అధికారులు, నాయకులు ఎటువంటి ఇబ్బ ంది లేకుండా గట్టు  పొడవునా పరిశీలించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు.  అధికారులు గాని, నాయకులు గాని పట్టిచుకోకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గోదావరి దిగువ భాగంలో ప్రవహించి వెళ్లిపోతే పర్వాలేదు. ఒక వేళ ఏటిగట్టును తాకి మట్టం పెరిగితే ఎపుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇసుక మూటలతో పటిష్ట పరచాలని అక్కడక్కడ నిల్వలు కూడా ఉంచాలని  కోరుతున్నారు. 


Updated Date - 2021-07-26T05:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising