ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటేశ్వరరావుకు ఘంటసాల స్మారక పురస్కారం

ABN, First Publish Date - 2021-12-06T05:00:43+05:30

సరిగమ సంగీత పరిషత్‌ వ్యవస్థాపకుడు శింగవరపు కోటేశ్వరరావు ఘంటసాల శత జయంతి వేడుకల స్మారక పురస్కారం అందుకు న్నారు.

పురస్కారం అందుకుంటున్న కోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, డిసెంబరు 5: సరిగమ సంగీత పరిషత్‌ వ్యవస్థాపకుడు శింగవరపు కోటేశ్వరరావు ఘంటసాల శత జయంతి వేడుకల స్మారక పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో 19 ఏళ్లు ఏకధాటిగా ఆకివీడులో ఘంటసాల ఆరాధన ఉత్సవాలు నిర్వహించడంతో ఆయన అవార్డుకు ఎంపిక య్యారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నుంచి కోటేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు.  ఘంటసాల తెలుగువారి గుండె చప్పుడు అని జస్టిస్‌ ఎన్వీ.రమణ అన్నారని కోటేశ్వరరావు తెలిపారు. ఘంటసాల తన గానామృతంతో పండిత పామరులను ఆలరించారన్నారు. తనకు అందించిన పురస్కారం సంగీత ప్రియులకు అంకితమన్నారు. ఘంటసాల శత జయంతి వేడుకల్లో కార్యక్రమంలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, మాజీ ఎంపీ మురళీమోహన్‌, సినీ నటుడు నారాయణమూర్తి, తదితరులు ఉన్నారు. కోటేశ్వరరావు అవార్డు అందుకోవడంపై సరిగమ సంగీత పరిషత్‌ కార్యదర్శి కొల్లి వెంకన్నబాబు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-06T05:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising