ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బురద రహదారి..!

ABN, First Publish Date - 2021-07-22T05:07:03+05:30

తారు రోడ్డు.. సీసీ రోడ్డు.. గ్రావెల్‌ రోడ్డు తెలుసు.. ఇది మాత్రం బురద రోడ్డు..!

బురదమయమైన గజ్జరం – గోపవరం రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్ళపూడి, జూలై 21: తారు రోడ్డు.. సీసీ రోడ్డు.. గ్రావెల్‌ రోడ్డు తెలుసు.. ఇది మాత్రం బురద రోడ్డు..! వాహనంపై మాత్రమే కాదు నడిచి వెళ్లినా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే బురదలో జారిపోతారు. లేదా బురద నిండిన గోతుల్లో పడి కాళ్లు, చేతులు విరగ్టొట్టుకోవాల్సిందే. ఈ రహదారిపై గోతులతో ఇబ్బందిపడే వాహ న చోదకులకు కాస్త చినుకులు పడితే బురదతో తంటాలే.. ఇది గజ్జరం – గోపవరం రహదారి దుస్థితి. ధ్వంసమైన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మాణానికి రూ 3.60 కోట్లకు మంజూరు కాగా కాంట్రాక్టర్‌ పనులు చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం అదే రహదారి నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసినా అదే పరిస్థితి. ఇటీవల వర్షాలకు రహదారి మరింత చిత్తడిగా మారింది. ఈ రహదారిలో నాలుగు భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా కంపెనీల వాహనాల రాకపోకలకు ఆయా యాజమాన్యాలు తాత్కాలిక చర్యలు చేపట్టినా వర్షం పడితే రహదారి బురదమయంగా మారుతోంది. వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక విద్యార్థులు, మరో పక్క రైతులు మార్కెట్‌కు రావాలంటే ఎక్కడ జారిపడతామని భయపడుతున్నారు. త్వరితగతిన రహదారి నిర్మిణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజల కోరుతున్నారు.

Updated Date - 2021-07-22T05:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising