భీమవరం డీఎన్నార్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ABN, First Publish Date - 2021-10-30T04:58:04+05:30
కళాశాలలో డిజిటల్ లైబ్రరీ ద్వారా ఎన్‌పీటీఈఎల్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని డీఎన్నా ర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు.
భీమవరం ఎడ్యుకేషన్, అక్టోబరు 29 : కళాశాలలో డిజిటల్ లైబ్రరీ ద్వారా ఎన్‌పీటీఈఎల్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని డీఎన్నా ర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు అన్నారు. డీఎన్నార్ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యం లో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టం శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆయన మాట్లాడారు.స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు.కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.అంజన్‌కుమార్ మాట్లాడుతూ కళాశాలలో ప్రభుత్వం సీమాన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. వివ రాలకు 9121214528 నెంబర్‌లో సంప్రదించాలన్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు సారథి, వాసుదేవరావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధి ప్రేమ్‌కుమార్, టీపీవో కేవీ.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:58:04+05:30 IST