ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద భూమి స్వాధీనం

ABN, First Publish Date - 2021-01-20T05:48:27+05:30

గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలకు కారణమైన వివాదస్పద అటవీ భూమిని కన్నాపురం అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాదీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, జనవరి 19: గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలకు   కారణమైన వివాదస్పద అటవీ భూమిని కన్నాపురం అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాదీనం చేసుకున్నారు. బుట్టాయగూడెం పోలీసుల రక్షణలో  ఉన్న భూమి చుట్టూ ఎక్స్‌కవేటర్‌తో కందకం తవ్వించారు. కొంతకాలంగా ఏజెన్సీలోని అటవీ భూములు తమకే చెందుతాయంటూ రెడ్డిగూడెంకు చెందిన స్థానిక గిరిజనులు చెబుతున్నారు.  ఇటీవల గిరిజన, గిరిజనేతరులు  ఆయు ధాలతో దాడులు చేసుకున్నారు. కొందరు గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డిగూడెం గిరిజనులు పోడు భూములు పంచాలని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని  27 రోజులపాటు రెవెన్యూ కార్యాలయం ఎదుట రిలే  దీక్షలు కూడా చేశారు. ఇటీవలే ఆర్డీవో దీక్షలను విరమింప జేశారు. వివాదాస్పద భూమి అటవీశాఖదే కావడంతో స్వాధీనం చేసుకుని కందకం ఏర్పాటు చేసినట్లు రేంజర్‌ కృష్ణకుమారి తెలిపారు. మొత్తం 34.96 హెక్టార్ల భూమి ఉందన్నారు.


Updated Date - 2021-01-20T05:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising