ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకివీడులో వారం పాటు లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-08T06:08:23+05:30

పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని అధికారులు, వ్యాపారులు భావిం చారు.

వ్యాపారులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ వీరభద్రరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదో తేదీ నుంచి అమలుకు చాంబర్‌, అధికారుల నిర్ణయం

ఆకివీడు, మే 7 : పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని అధికారులు, వ్యాపారులు భావిం చారు. ఆ మేరకు దీనిని సోమవారం నుంచి వారం రోజులపాటు  అమ లు చేయనున్నారు. స్థానిక ఏఎంసీ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐ వీఎస్‌ వీరభద్రరావు, నగర పంచాయతీ కమిషనర్‌ బోయిన సాల్మన్‌రాజు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఛాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ వర్తకులు, ఆక్వా వ్యాపారులతో సమీక్ష నిర్వహించి లాక్‌డౌన్‌ ప్రకటించారు. మెడికల్‌ షాపులు మినహా మిగిలిన దుకాణా లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను పూర్తిస్థాయిలో మూసివేస్తారు. అనుమతించిన వారు మాత్రమే తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు మధ్యాహ్నం 12 గంటలలోపే అమ్మకాలు చేసుకోవాలి. మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ ఉన్నందున బయట ఎవరూ తిరగకూడదు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, వైసీపీ మండల, పట్టణ అధ్యక్షులు కేశిరెడ్డి మురళి, శిరపు శ్రీను, తూర్పుకాపు సంక్షేమ సంఘం డైరక్టర్‌ జగ్గురోతు విజయ్‌, జనసేన నేత గవర అనిల్‌ వివిధ వ్యాపారస్తులు ఉన్నారు. 


Updated Date - 2021-05-08T06:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising