ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ సేవకు సజీవ పురస్కారం

ABN, First Publish Date - 2021-10-19T06:02:40+05:30

సమాజ సేవకు సజీవ పురస్కారం కడలి గంగిశెట్టి స్తూపం ఏర్పాటు అని, 93 సంవత్సరాల వయస్సులో కూడా సమాజ సేవకు, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం తహతహలాడుతున్న కమ్యూనిస్టు భావాలు నేటికీ ఆయన సొంతమని మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పేర్కొన్నారు.

స్తూపం ఆవిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కడలి గంగిశెట్టికి సత్కారం..  స్తూపం ఆవిష్కరణ

వీరవాసరం, అక్టోబరు 18: సమాజ సేవకు సజీవ పురస్కారం కడలి గంగిశెట్టి స్తూపం ఏర్పాటు అని, 93 సంవత్సరాల వయస్సులో కూడా సమాజ సేవకు, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం తహతహలాడుతున్న కమ్యూనిస్టు భావాలు నేటికీ ఆయన సొంతమని మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పేర్కొన్నారు. మండలంలోని నవుడూరు గ్రామం కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. ఎందరో ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. సోమవారం నవుడూరులోని మృత్యుంజయనగర్‌లో నిర్మించిన కడలి గంగిశెట్టి సజీవ స్తూపం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జరిగిన సభకు  సీపీఐ నాయకుడు వర్మ అధ్యక్షత వహించారు. కడలి గంగిశెట్టిని సత్కరించా రు.  సభలో  డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు, జడ్పీటీసీ కాండ్రేకుల నర్సింహారావు, ఎంపీపీ వీరవల్లి గంగాభవాని,  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు, పాకా సత్యనారాయణ, దూసనపూడి సోమసుందర్‌, గుండా రామకృష్ణ, యాళ్ళబండి నారాయణమూర్తి, రవీంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిష్టు ఉధ్యమంలో గంగిశెట్టి పోరాటాన్ని ,   ఆయన సమాజ సేవలను కొనియాడారు. 



Updated Date - 2021-10-19T06:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising