ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగు మందు డబ్బాలతో రైతుల ధర్నా

ABN, First Publish Date - 2021-05-18T06:05:25+05:30

తడిచిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో లింగపాలెం మండ లం ధర్మాజీగూడెంలో రైతులతో ధర్నా నిర్వహించారు.

పురుగుమందు డబ్బాలతో ధర్నా చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడిచిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లకు డిమాండ్‌

 లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్న అన్నదాత

చింతలపూడి (లింగపాలెం), మే 17: తడిచిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో లింగపాలెం మండ లం ధర్మాజీగూడెంలో రైతులతో ధర్నా నిర్వహించారు. రైతులు పురుగు మందుల డబ్బాలు పట్టుకుని పంట కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ప్రదర్శన జరిపారు. ధర్మాజీగూడెం మార్కెట్‌ యార్డు గోదా ముల వద్ద రైతులు గోనె సంచులు ఇవ్వండి పంటలు కొనుగోలు చేయం డంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్‌ మాట్లాడు తూ ప్రభుత్వం ధాన్యం,  మొక్కజొన్న  కొనుగోలు చేయకపోవడం వల్ల కల్లాల్లో ఉన్న పంటలు  వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. వ్యాపారులు, మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసి  రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడమే తప్ప వాస్తవంలో లేదని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గోనె సంచులు ఇవ్వాలన్నారు. పంట రవాణా ఛార్జీలు రైతుల నుంచి వసూలు చేయడం అన్యాయమన్నారు. దళారులు వంద నుంచి రూ. 300 రూపాయలు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో దిక్కులేక అమ్ముతున్న రైతు నష్టాల బారిన పడుతున్నారన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. ఈ ధర్నాలో రైతులు కె రత్నకుమార్‌, వై విష్ణువర్ధనరావు, పి. అచ్చియ్య, సాయిబాబు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising