ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లో వోల్టేజి సమస్యపై రైతుల ధర్నా

ABN, First Publish Date - 2021-02-28T05:34:50+05:30

బొర్రంపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని బొర్రంపాలెం, సింగరాయపాలెం, వల్లంపట్ల గ్రామాలకు చెందిన రైతులు లో–వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం, ఫిబ్రవరి 27: బొర్రంపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలోని బొర్రంపాలెం, సింగరాయపాలెం, వల్లంపట్ల గ్రామాలకు చెందిన రైతులు లో–వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయన్నారు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పంటలు వేశామని, అవి ఎండిపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. విద్యుత్‌ ను షిఫ్ట్‌ల వారీగా ఇవ్వడం లేదని సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే సిబ్బంది స్పందిం చడం లేదని ఆరోపించారు. వల్లంపట్లలో కొత్త సబ్‌స్టేషన్‌ మంజూరైందని రెండు నెలలుగా చెబుతున్నారని, పనులను త్వరగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కామవరపుకోట ఏడీఈ ఓంకార్‌  రైతులతో చర్చించి ఆందోళన విరమింపచేశారు.  రైతులు కె.బాలకృష్ణ, ఆంధ్రబాబు, ఎన్‌.అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising