ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానమ్మా.. ఇక ఆగమ్మా

ABN, First Publish Date - 2021-11-29T05:15:54+05:30

అన్నదాతను తెరుకోనీయడం లేదు..అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి మళ్లీ వరుణుడు నేనున్నా నంటూ వస్తున్నాడు..తుడిచి పెట్టేస్తున్నాడు

ఆదివారం మొగల్తూరులో కురిసిన వానతో తడిచిన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాసూళ్ల పనుల్లో రైతులు బిజీ బిజీ

ఆదివారం చిరుజల్లులతో ఆందోళన

మళ్లీ ముంచేస్తుందని భయం..భయం


ఉండి/భీమవరం రూరల్‌, నవంబరు 28 : అన్నదాతను తెరుకోనీయడం లేదు..అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి మళ్లీ వరుణుడు నేనున్నా నంటూ వస్తున్నాడు..తుడిచి పెట్టేస్తున్నాడు. ఆది నుంచి సార్వాకు ఇబ్బందుల్లేక పోయినా చివరిలో మాత్రం తుడిచిపెట్టేసింది. అన్నదాతలను నిండా ముంచేసిం ది. మాసూళ్లకు వర్షాలు అడ్డంకిగా మారాయి. దీంతో మాసూళ్లు వెనక్కి వెనక్కి వెళ్లిపోతున్నాయి. మొన్న రెండు వాయుగుండాల ప్రభావంతో దాదాపు 20 రోజులుపైగా పంట మాసూళ్లు చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. అయితే గత రెండు మూడు రోజులుగా కాస్త తెరిపివ్వడంతో నేలమట్టమైన పంటను దక్కిం చుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. చిరుజల్లులు పడుతున్నా పంటను దక్కిం చుకోవడానికి రైతులు చురుగ్గా పనులు చేపడుతున్నారు.పండిన పంట ను ఏదోరకంగా దక్కించుకోవాలనే తాపత్రయంలో రైతులు ఉన్నారు. 


ముందుకు సాగని మాసూళ్లు


ఆకివీడురూరల్‌/భీమవరం రూరల్‌/ యలమంచిలి/మొగల్తూరు, నవంబరు 28 : ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై మధ్యాహ్నం నుంచి తేలికపాటి వర్షం పడుతుంటే రైతులు భయాందోళనలకు గురయ్యారు. అల్పపీడన ప్రభావంతో చిన్నపాటి వర్షం కురవడంతో పంట మాసూళ్లకు వీలు లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. కొంత మంది కోతలు కోసి వరి పనలు  కడుతున్నారు. మరికొంత మంది పడుగులు వేసి నూర్పు చేపట్టారు. చినుకులు పడుతుండడంతో హుటాహుటిన బరకాలను వాటిపై కప్పారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల ఇప్పటికే వరి పొలాలు నీట మునిగి, నేల వాలాయి. ఎకరాకు రూ.25వేలకు పైగా పెట్టుబడి పెట్టామని పైసా కూడా తిరిగిరాని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబ డులు పెట్టామని ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు.వరుణదేవా ఇక ఆగవా అంటూ వేడుకుంటున్నారు. పంట చేతి కొచ్చే సమయంలో ప్రభుత్వం సబ్సిడీపై బరకాలు అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని కోరుతున్నారు.  



Updated Date - 2021-11-29T05:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising