ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీష్మ ఏకాదశి

ABN, First Publish Date - 2021-02-24T05:23:53+05:30

వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు, భీష్మఏకాదశి సందర్భంగా మంగళవారం స్వామివారికి పూజలు, అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.

ఆచంటలో వేంకటేశ్వరస్వామి రథోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంటలో వైభవంగా రథోత్సవం, ఆలయాల్లో పూజలు


ఆచంట, ఫిబ్రవరి 23: వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు, భీష్మఏకాదశి సందర్భంగా మంగళవారం స్వామివారికి పూజలు, అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథోత్సవం వేడుకగా సాగింది. రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి రఽథాన్ని లాగడానికి భక్తులు ఎగబడ్డారు.


లక్ష్మీనారాయణుడి కల్యాణం


పెనుమంట్ర : భీష్మ ఏకాదశిని పురస్కరిచుకుని నెగ్గిపూడిలోని లక్ష్మి నరసింహస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండిడుతు తోలేటి రాంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి సామూహిక కళ్యాణం చేయించారు. లక్షతులసీ పూజ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. నెగ్గిపూడి, మార్టేరు, సత్యవరం గ్రామాలకు చెందిన భక్తులు స్వామి వారి దర్శించుకున్నారు.


సత్యనారాయణ స్వామి కల్యాణం


వీరవాసరం: నవుడూరు జంక్షన్‌లోని రమా సమేత సత్యనారాయణస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు మహోత్సవాలను రద్దుచేసి సంప్రదాయం మేరకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. వేదపండితులు వాడపల్లి సీతారామచార్యులు, వాడపల్లి పృధ్వీరాజ్‌ ఆధ్వ ర్యంలో వైఖానస ఆగమ ప్రకారం కళ్యాణం నిర్వహించారు.


భీమవరం టౌన్‌: భీష్మ ఏకాదశి సందర్భంగా హౌసింగ్‌ బోర్డుకాలనీలో పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో తోమాల సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకారం చేశారు. మహిళలు విష్ణు సహస్ర నామ పారాయణ చేశారు. అర్చకుడు పోనంగపల్లి శ్రీనివాసాచార్యులు, కంతేటి వెంకట్రాజు, కుక్కల బాల వెంకట రత్నం, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


మెంటేవారితోట బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమలతో అభిషేకాలను నిర్వహించారు. ఆలయ అర్చకుడు కొమ్ము శ్రీనివాస్‌ అమ్మవారికి సహస్రమాలతో కుంకుమ పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-02-24T05:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising