ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-06-24T04:48:01+05:30

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ అన్నారు.

కొవ్వూరులో మాట్లాడుతున్న పట్టణ ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూన్‌ 23: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ కె.వెంకటరమణ అన్నారు. మునిసిపల్‌ సమావేశ మందిరంలో కరోనా నియంత్రణ, అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ దినం సందర్భంగా వ్యాపారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ వెంకటరమణ మాట్లాడుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు ఇచ్చిందన్నారు. సడలింపు సమయంలో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలను వివరించారు. పట్టణ పరిధిలో ఎవరైనా మాదకద్రవ్యాలను విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ కెటి.సుధాకర్‌, తహసీల్దార్‌ బి.నాగరాజ నాయక్‌, వ్యాపారులు, అధికారులు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడితే జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని ఎస్‌ఈబీ సీఐ వీటీవీవీ.సత్యనారాయణ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై పట్టణంలో అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు, వాటివలన కలిగే నష్టాలను వివరించారు. ఎస్‌ఐ జి.బసంతి, సిబ్బంది పాల్గొన్నారు.


కొయ్యలగూడెం: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్‌ సూచించారు. మండలంలోని బయ్యన్నగూ డెంలో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువతను ఎంతో ప్రభవితం చేస్తుందన్నారు. మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయన్నారు. కార్యక్రమం లో ఎస్‌ఐ కే.సతీష్‌, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising