పోలవరం చెంత దాహం కేకలు
ABN, First Publish Date - 2021-10-30T04:57:21+05:30
ఎల్‌ఎన్‌డీ.పేట, బంగారమ్మపేట గ్రామాల ప్రజలు తాగునీరు లేక దాహంతో అలమటిస్తున్నారు.
పోలవరం, అక్టోబరు 29: ఎల్‌ఎన్‌డీ.పేట, బంగారమ్మపేట గ్రామాల ప్రజలు తాగునీరు లేక దాహంతో అలమటిస్తున్నారు. సత్యసాయి మంచి నీటి పథకం పునరుద్ధరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో శుక్ర వారం నిరసన వ్యక్తం చేశారు. బంగారమ్మపేట మహిళ దత్తి దేవి మాట్లాడు తూ రెండు నెలలుగా సత్యసాయి మంచినీటి పథకం మంచినీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. నీటి సరఫరా నిలిచిపోయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా పునరుద్ధరించ కపోతే ఖాళీ బిందెలతో సచివాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సత్యసాయి కార్మికుల జీతాల బకాయిలు వెంటనే చెల్లించి మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.
Updated Date - 2021-10-30T04:57:21+05:30 IST