ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు వజ్రాయుధం

ABN, First Publish Date - 2021-01-26T05:58:19+05:30

వజ్రాయుధం లాంటి ఓటుహక్కును ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయో గించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వజ్రాయుధం లాంటి ఓటుహక్కును ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయో గించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం జేసీ వెంకటరమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన 11వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంటుందని 18 సంవత్స రాలు నిండిన వెంటనే యువత ఓటరుగా నమోదు చేసుకో వాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల యాజ మాన్యం విద్యార్థులను ఓటరుగా నమోదు చేయడంలో సహకరించాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఓటర్లు చైతన్య వంతులై ఉండాలన్నారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సంద ర్భంగా ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈవీ ఎంల శకట ప్రదర్శన నిర్వహిం చారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రోటోకాల్‌ మేజిస్ట్రేట్‌ దుర్గాప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) నంబూరి తేజ్‌ భరత్‌ రక్తదానం చేశారు. వీరితోపాటు డీఆర్‌వో శ్రీనివాస మూర్తి, ఏఎస్‌పీ అడ్మిన్‌ ఏవీ సుబ్బరాజు, జడ్పీ సీఈవో శ్రీనివాసులు, డీఈవో సీవీ రేణుక తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T05:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising