ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై డీజిల్‌ చోరీ ముఠా అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-12-08T05:18:47+05:30

హైవేపై ఆగి వున్న లారీల నుంచి డీజిల్‌ను అపహరించే ఓ ముఠాను ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని డీఎస్పీ డాక్టరు దిలీప్‌కిరణ్‌ తెలిపారు.

వివరాలు తెలుపుతున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

400 లీటర్ల డీజిల్‌, 4 ఫోన్లు స్వాధీనం

ఏలూరు క్రైం, డిసెంబరు 7 : హైవేపై ఆగి వున్న లారీల నుంచి డీజిల్‌ను అపహరించే ఓ ముఠాను ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని డీఎస్పీ డాక్టరు దిలీప్‌కిరణ్‌ తెలిపారు. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం రాత్రి విలేక రుల సమావేశంలో ఏడుగురు ముఠా వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన ఉండవల్లి రాజేష్‌ (42) కొంతకాలం కిందట ఏలూరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటూ హైవేపై రాత్రివేళ ఆగివున్న లారీల నుంచి సులువుగా డీజిల్‌ను దొంగిలిస్తుంటాడు. అతడు ఓ ముఠాను ఏర్పాటు చేసుకు న్నాడు. పెదపాడు మండలం కలపర్రుకు చెందిన కాటూరు కుటుంబరావు అలియాస్‌ శంకరరావు (27), నల్లబోతు రాజేష్‌ అలియాస్‌ స్టీఫెన్‌ (23), ఏలూరు గొల్లాయిగూడెంకు చెందిన కుంచు కోటేశ్వరరావు (25), గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన కొలకలూరి రవి, గాజులపర్తి సాంబశివరావు (20), రావినూతుల సాంబశివరావు (26) వీరు రాత్రివేళ ఐషర్‌వ్యాన్‌, కార్లు వేసుకుని హైవేపై తిరుగుతుంటారు. వారికి ఇన్‌ఫార్మర్లగా హిజ్రాలను, మరికొంత మం దిని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించామన్నారు. మంగళవారం కలపర్రు హైవేపై వద్ద ఓ లారీ నుంచి డీజిల్‌ను తస్కరిస్తుండగా ముఠాను పోలీస్‌ బృందం పట్టు కుంది. వీరి నుంచి ఓ ఐషర్‌ వ్యాను, కారు, సుమారు 400 లీటర్ల డీజీల్‌, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 5వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిం దితులను అరెస్ట్‌ చేసిన సీఐ, ఎస్‌ఐ సిబ్బందికి రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు. త్రీటౌన్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, ఎస్‌ఐలు శంకర్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising