ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంత దయనీయం

ABN, First Publish Date - 2021-04-17T05:19:37+05:30

కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. అయినవారి కడసారి చూపులు లేకుండానే వారి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పెదపాడు మండలం వట్లూరుకు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో భార్య మృతి

అనారోగ్యంతో ఆసుపత్రిలో భర్త 

విదేశాల్లో కుమారులు

దక్కని కడసారి చూపులు.. 

ఆసుపత్రి సిబ్బందితోనే ఆమె అంత్యక్రియలు

పెదపాడు, ఏప్రిల్‌ 16 : కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. అయినవారి కడసారి చూపులు లేకుండానే వారి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పెదపాడు మండలం వట్లూరుకు చెందిన 83 ఏళ్ల వృద్ధురాలు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిం ది. కుమారులు విదేశాల్లో స్థిరపడగా గ్రామంలో నివాస ముంటున్న దంపతులు ఈ నెల 5న ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అనంతరం ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఏలూరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో బంధువుల సహకారంతో 12న కొవిడ్‌ పరీక్షలు నిర్వహిం చగా, భర్తకు నెగిటివ్‌, భార్యకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు 14వ తేదీ రాత్రి మృతి చెందగా, భర్త ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆసుపత్రి సిబ్బంది సహకారంతోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె కడసారి చూపు దక్కలేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2021-04-17T05:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising