ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న కొనండి

ABN, First Publish Date - 2021-05-25T05:06:26+05:30

ఒకవైపు ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పు, మరో వైపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద సంచుల కొరత రైతులను భయ పెడుతోంది.

టార్పాలిన్‌తో కప్పి ఉంచిన మొక్కజొన్న రాశులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల వేడుకోలు

వర్షంతో భయం


నల్లజర్ల, మే 24 : ఒకవైపు ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పు, మరో వైపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద సంచుల కొరత రైతులను భయ పెడుతోంది. పంట చేతికందే సమయంలో వర్షానికి తడిసి నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోలు చేయడం రైతులను కుంగదీస్తోంది. మండంలో మూడు వేల హెక్టార్లలో సుమారు 15 వేల టన్నుల మొక్కజొన్న దిగుబడి అవుతుంది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో 110 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నల్లజర్ల సొసైటీ, పోతవరం డీసీఎంఎస్‌ కేంద్రా ల్లో సంచుల కొరత కారణంగా మొక్కజొన్న రాశులను రైతులు టార్ఫాలిన్‌ కపి ఉంచారు. తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తు న్నారు. సంచులు అందజేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


పుచ్చకాయల రైతులను ఆదుకోవాలి 

జంగారెడ్డిగూడెం : కరోన ప్రభావంతో నష్టపోతున్న పుచ్చకాయల రైతుల ను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరుతలో మాట్లాడారు. జిల్లాలో వందలాది ఎకరాల్లో రైతులు పుచ్చకాయల సాగు చేపట్టారన్నారు. మెట్ట ప్రాంత మండలాలైన జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, కామవరపుకోట, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు, పెదవేగి తదితర మండలాల్లో రైతులు పుచ్చకాయ సాగు చేసి  నష్టాలలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారులు మార్కెట్లో పుచ్చకాయలు కొనవలసి వస్తే అధిక ధరలు చెబుతున్నారని, రైతుకు మాత్రం కనీసం ధర కూడా రావడం లేదన్నారు. టన్ను పుచ్చకాయల ధర రైతు రూ.11వేల నుంచి రూ.3వేలకు పడిపోయిందని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది

దేవరపల్లి: ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. సూర్యనారాయణపురంలో సోమవారం ధాన్యం ఎగుమతులను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు  ధాన్యాన్ని త్వరితగతిన అమ్మకాలు చేపట్టాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-05-25T05:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising