వైఎన్ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేయాలి
ABN, First Publish Date - 2021-10-22T05:13:44+05:30
వైఎన్ కళాశాలను ప్రభుత్వం లో విలీనం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మె ల్సీలు ఐ.వెంకటేశ్వరావు, ఎస్‌కె సాబ్జీలు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీలు షేక్ సాబ్జీ, ఐవీఆర్ డిమాండ్
నరసాపురం టౌన్, అక్టోబరు 21: వైఎన్ కళాశాలను ప్రభుత్వం లో విలీనం చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మె ల్సీలు ఐ.వెంకటేశ్వరావు, ఎస్‌కె సాబ్జీలు డిమాండ్ చేశారు. అంబే డ్కర్ కమ్యూనిటీ హాలులో గురు వారం ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మా ట్లాడారు. విద్యారంగంలో వైఎన్‌కు ఎంతో పేరు ఉందన్నారు.ప్రైవేట్ యాజ మాన్యంలో కొనసాగితే పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల పోరాటాలకు అండగా ఉంటామన్నారు. సమస్యను శాసన మండలిలో ప్రస్తావిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ,వామపక్షాల నాయకులు దొండపాటి స్వామి, ఎం.త్రిమూ ర్తులు,క్రాంతికుమార్, న్యాయవాది చదలవాడ జ్ఞానప్రకాష్, యూటీఎఫ్ నాయ కులు మార్కండేయులు, శ్యాంసన్, నళిని, శ్రీధర్,మహేష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:13:44+05:30 IST