ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ వృథా చేస్తే..

ABN, First Publish Date - 2021-05-07T05:45:12+05:30

ప్రతి చుక్క ఆక్సిజన్‌ ఎంతో విలువైనదని, దానిని వృథా చేస్తే చర్యలు తప్ప వని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు.

సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 6(ఆంధ్రజ్యోతి):ప్రతి చుక్క ఆక్సిజన్‌ ఎంతో విలువైనదని, దానిని వృథా చేస్తే చర్యలు తప్ప వని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆయన కొవిడ్‌పై వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ నిల్వలను పరిశీలించు కొని, భర్తీ చేసుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలైన కైకలూరు, గన్నవరం, కొవ్వూరుల్లో అధికారు లను ఏర్పాటు చేయాలన్నారు. 50 శాతం కోటా ప్రకా రం ఆక్సిజన్‌ జిల్లాకు వచ్చేలా చూడాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలను ప్రతి రోజూ నోడల్‌ అధికారితో కలిసి సివిల్‌ సప్లైస్‌ డీటీలు తనిఖీలు చేయాలన్నారు. ప్రతి ఆర్డీవో కార్యాలయంలో ఆక్సిజన్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రెండో డోసు టీకా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జేసీ హిమాన్షు శుక్లా, ట్రైనీ అసిస్టెంటు కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌, డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌, డీఎంహెచ్‌వో సునంద, డీఎస్‌ఓ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising