ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే ఇళ్ల నిర్మాణానికి చర్యలు

ABN, First Publish Date - 2021-01-21T05:02:25+05:30

లే అవుట్లలో లబ్ధిదారులు తక్షణమే గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ముత్యాలరాజు జేసీలు,హౌసింగ్‌ పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 23వ తేదీకి పట్టాలు పంపిణీ పూర్తవ్వాలి

 నిర్మాణాలకు సచివాలయ సిబ్బంది సేవలు

 కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు

ఏలూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): లే అవుట్లలో లబ్ధిదారులు తక్షణమే గృహ నిర్మాణాలు చేపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ముత్యాల రాజు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఆయన తహసీల్దారులు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీనాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. కొత్త లే అవుట్‌ కాలనీల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను గృహ నిర్మాణాలకు వినియోగించాలని అన్నారు. నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా మండల, డివిజన్‌ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గృహనిర్మాణాలు త్వరిత గతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో ప్రతి లబ్ధ్దిదారుని మ్యాపింగ్‌ పూర్తి కావాలని, వివరాలను గృహ నిర్మాణ శాఖ వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు మ్యాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వీసీలో జేసీలు హిమాంశు శుక్లా, నంబూరి తేజ్‌ భరత్‌, హౌసింగ్‌ పీడీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising