ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెం కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-09-04T05:03:10+05:30

జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ ముగిసింది.

ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 3: జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఎంపీ, ఎమ్మె ల్యేల వర్గీయుల మధ్య ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయులే కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌ బత్తి న లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పాశం రామ కృష్ణను కౌన్సిలర్‌ కాసర తులసి, షేక్‌ పర్వీన్‌ను కౌన్సిలర్‌ ముప్పిడి వీరాంజ నేయులు, వెంపా ఇజాక్‌ ప్రసాద్‌ డేవిడ్‌ లివింగ్‌ స్టన్‌ను కౌన్సిలర్‌ పీపీఎన్‌ చంద్రరావు ప్రతిపాదించారు. ముగ్గురిని ఏకగీవ్రంగా ప్రకటించారు.


కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికపై ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు పట్టుబట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 29 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో 31 ఓట్లు ఉన్నాయి. ఎన్నిక ప్రక్రియలో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఎమ్మేల్యే ఎలీజా పాల్గొన్నారు. 15 మంది ఉండగా కోరం కావాలంటే 16 మంది ఉండాలి. అనూహ్యంగా టీడీపీ కౌన్సిలర్‌ తెలగారపు జ్యోతి కలవడం తో కోరం పూర్తయింది. ముగ్గురు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియకు గైర్హాజరయ్యారు.

Updated Date - 2021-09-04T05:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising