ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి : ఆర్డీవో

ABN, First Publish Date - 2021-10-30T05:02:01+05:30

వ్యాక్సినేషన్‌పై గ్రామీణ ప్రాంత ప్రజలలో అపో హలను తొలగించి నూరు శాతం పూర్తి చేయడానికి సచివాలయ కార్యదర్శులు కృషిచేయాలని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు.

కొవ్వూరు మండలం చిడిపిలో ఆర్డీవో పర్యటన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, అక్టోబరు 29: వ్యాక్సినేషన్‌పై గ్రామీణ ప్రాంత ప్రజలలో అపోహలను తొలగించి నూరు శాతం పూర్తి చేయడానికి సచివాలయ కార్యదర్శులు కృషిచేయాలని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు అన్నారు. చిడిపి గ్రామంలో శుక్రవారం సిటిజన్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, తహసీల్దార్‌ బి.నాగరాజ నాయక్‌ మోటార్‌సైకిల్‌పై ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజలను నుంచి అభిప్రాయాలను సేకరించారు. గ్రామంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం, డ్రెయినేజీ, కల్వర్టు పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయని సర్పంచ్‌ పాలడుగుల లక్ష్మణరావు ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చేపట్టిన పనులకు బిల్లులు కాలేదన్నారు. గ్రామ కార్యదర్శి నరేంద్రబాబు, వీఆర్వో బంగారుబాబు, వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


జంగారెడ్డిగూడెం: పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం పరిశీలించారు. ప్రజలకు సచివాలయంలో ఎలాంటి సేవలు అందిస్తారో అవగాహన కల్పించారు.

Updated Date - 2021-10-30T05:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising