ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలితం చెప్పని సర్వర్లు

ABN, First Publish Date - 2021-05-05T06:03:26+05:30

కరోనా పరీక్షలు చేయించుకుని మూడు నాలుగు రోజులైనా ఫలితం రాక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొవిడ్‌ పరీక్షలకు క్యూలో...టెస్టింగ్‌..టెన్షన్‌..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెన్షన్‌తో అనుమానిత బాధితులు 

పట్టించుకోని అధికారులు 

ఏలూరు క్రైం, మే 4 : కరోనా పరీక్షలు చేయించుకుని మూడు నాలుగు రోజులైనా ఫలితం రాక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. మొబైల్‌కు మెసేజ్‌ వస్తుందని చెబుతున్నప్పటికీ చాలా మందికి రావడం లేదు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి హెల్ప్‌ డెస్క్‌ వద్దకు వెళ్లి కరోనా పరీక్ష చేయించు కున్న ఐడీ నెంబర్‌తో రిజల్ట్‌ చెప్పమని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే. సర్వర్లు పనిచేయడం లేదని. ఎన్ని రోజులు వెళ్లినా ఇదే సమాధానం. వాస్తవానికి అక్కడ పనిచేసే సిబ్బంది సిస్టమ్‌లో ఎంత ప్రయత్నించినా సర్వర్లు పనిచేయడం లేదు. కరోనాకు సంబంధించి అన్ని రకాల (వ్యాక్సిన్‌ రిజిస్టర్‌, వ్యాక్సిన్‌ వేయడం) ఒకే పోర్టల్‌లో ఉండడంతో దానిపైన ఎక్కువ  భారం పడడంతో అవి పనిచేయడం లేదు. ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా రాష్ట్రస్థాయిలో సర్వర్ల కెపాసిటీ పెంచాలన్న సమాధానం వస్తోంది. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో కరోనా పరీక్షకు ఇచ్చిన వారు టెన్షన్‌ టెన్షన్‌తో ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై తక్షణం చర్యలు తీసుకుని సర్వర్ల కెపాసిటి పెంచేలా రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలి.  


Updated Date - 2021-05-05T06:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising