ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-06-17T05:20:35+05:30

అశాస్ర్తీయ నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కబర్ధి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు, జూన్‌, 16: అశాస్ర్తీయ నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉన్నమట్ల కబర్ధి డిమాండ్‌ చేశారు. బీజేపీ పిలుపు మేరకు పాలకొల్లు మునిసిపల్‌ కార్యాలయం వద్ద బుధవారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌ నేతృత్వం లో నిరసన చేపట్టారు. ఈ మేరకు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.ప్రమోద్‌ కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి పద్మారావు, సీనియర్‌ నాయకుడు నాళం బాబి, పట్టణ మహిళాధ్యక్షరాలు అల్లూరి పద్మ వర్మ, పట్టణ బీసీ మోర్చా నాయకులు బొక్కా నరసింహమూ ర్తి, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు గవర పవన్‌ నాయుడు పాల్గొన్నారు. 

నరసాపురంలో..

నరసాపురం టౌన్‌, జూన్‌ 16 :మునిసిపల్‌ అస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మునిసి పల్‌ కార్యాలయంలో మేనేజర్‌ శివాజీకి బుధవారం డాక్టర్‌ ప్రకాష్‌ వినతి పత్రం అందించి మాట్లాడుతూ కరోనా సమయంలో పన్నుల భారం పెంచ డం సరికాదన్నారు. కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాస్‌, ఎం.వెంకటేశ్వరావు, కంచర్ల నాగేశ్వరరావు, వెంకట్‌, సత్యకృష్ణ ఉన్నారు.

Updated Date - 2021-06-17T05:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising