ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరంలో వార్డుల రిజర్వేషన్‌ సంఖ్య ఇలా..

ABN, First Publish Date - 2021-04-24T04:52:02+05:30

మునిసిపల్‌ ఎన్నికలకు భీమవరం పట్టణంలో వార్డు రిజర్వేషన్‌ సంఖ్యలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నెలాఖరుకు వార్డుల వారీ రిజర్వేషన్‌ ప్రకటన 

భీమవరం, ఏప్రిల్‌ 23 : మునిసిపల్‌ ఎన్నికలకు భీమవరం పట్టణంలో వార్డు రిజర్వేషన్‌ సంఖ్యలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టణంలో 39 వార్డులు ఉన్నాయి. సంఖ్యా పరంగా ఎన్ని వార్డులు రిజర్వేషన్‌ చేస్తారనే విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ జనరల్‌కు 2 వార్డులు, ఎస్సీ మహిళకు 2, బీసీ జనరల్‌ కేటగిరీకి 7, బీసీ మహిళలకు 6, జనరల్‌ కేటగిరిలో మహిళలకు 11, జనరల్‌ కేటగిరీకి 10 వార్డులు కేటాయించారు. పట్టణంలో రిజర్వేషన్లు కేటగిరి ఓటర్ల సర్వే ప్రక్రియలో గుర్తించిన వారి వివరాల ముసాయిదా జాబితాను మునిసిపల్‌ కమిషనర్‌ శ్యామల దేవి శుక్రవారం ప్రకటించారు. వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ మహిళల ఓటర్ల వివరాలపై ఈనెల తొలి వారం నుంచి సర్వే చేపట్టారు. గుర్తించిన వారి వివరాలను పురపాలక సంఘ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రకటిస్తున్నామని తెలిపారు. జాబితాపై ఈ నెల 26వ తేదీలోగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని తెలిపారు. నెలాఖరు నాటికి అభ్యంతరాలను పరిష్క రించి వార్డుల వారీగా రిజర్వేషన్లను కేటాయిస్తారు. 

Updated Date - 2021-04-24T04:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising